![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -957 లో.. మహేంద్ర దగ్గరకి శైలేంద్రని తీసుకొని ఫణీంద్ర వస్తాడు. రిషి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుగా.. ఇంకా లేదని ముకుల్ కి ఏదో క్లూ దొరికిందంట, త్వరలోనే నేరస్తులని పట్టుకుంటానని చెప్పాడని మహేంద్ర అంటాడు. జగతి విషయంలో గాని రిషి విషయంలో గానీ నీకు శైలేంద్ర మీద ఎందుకు డౌట్ వచ్చిందని ఫణింద్ర అడుగుతాడు.
ఒకవేళ శైలేంద్రనే ఇదంతా చేస్తున్నాడని తెలిస్తే మీ వరకు ఎందుకు నేనే శైలేంద్రని షూట్ చేస్తానని ఫణింద్ర అనగానే శైలేంద్ర షాక్ అవుతాడు. నిజనిజాలు తెలియకుండా మనం తొందరపడవద్దు. చట్టం ద్వారా వెళ్ళాలని ఫణింద్ర చెప్పగానే.. అవును మేమ్ చట్టం ద్వారానే వెళ్తున్నామని అక్కడే ఉన్న వసుధార అంటుంది. మరొకవైపు దేవయాని శైలేంద్ర గురించి టెన్షన్ పడుతుంటుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి.. ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతాడు. నువ్వు దేని గురించి టెన్షన్ పడకు త్వరలోనే DBST కాలేజీ సామ్రాజ్యానికి నేనే అధిపతి అవుతానని శైలేంద్ర పగటి కలలు కంటుంటాడు. మరొకవైపు శైలేంద్ర యొక్క రౌడీ భద్ర కావాలనే మహేంద్రకి ఎదరుపడి ఎవరితో గొడవపెట్టుకుంటున్నట్లు యాక్టింగ్ చేస్తాడు. మహేంద్ర వచ్చి ఏమైందని అడుగుతాడు. ఏమి లేదు సర్ టీ ఇవ్వు డబ్బులు రేపు ఇస్తానంటే ఇవ్వడం లేదని భద్ర అంటాడు. మరి టీ డబ్బులు కూడా లేవా అని మహేంద్ర అంటాడు.లేవని భద్ర అనగానే.. ఏమి చేస్తాను ఏమి చెయ్యను నాకు ఎవరు ఉద్యోగం ఇస్తారంటూ మహేంద్ర ముందు కావాలనే నటిస్తుంటాడు. ఆ తర్వాత కాసేపటికి నా దగ్గర డ్రైవర్ గా చెయ్ అని మహేంద్ర అంటాడు దానికి భద్ర ఒప్పుకుంటాడు. అదంతా కూడా శైలేంద్ర చూస్తుంటాడు...
మరొకవైపు వసుధార, అనుపమ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే.. అప్పుడే భద్రని తీసుకొని మహేంద్ర వస్తాడు. ఇతనికి నేనే డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చానని వాళ్ళకి మహేంద్ర చెప్తాడు. నువ్వు డ్రైవర్ మాత్రమే కాదు వాళ్ళకి సెక్యూరిటీ కూడా మొన్న వాళ్లపై ఎవరో ఎటాక్ చేసినప్పుడు కాపాడావ్ కాదా అని మహేంద్ర అంటాడు. అప్పుడు ఎవరో తెలియకుండానే కాపాడాను.. ఇప్పుడు మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు కాపాడుకుంటానని భద్ర అంటాడు. అ తర్వాత శైలేంద్రకి భద్ర ఫోన్ చేసి మాట్లాడుతుంటే మహేంద్ర వచ్చి.. ఎవరితో మాట్లాడుతున్నావని అంటాడు. భద్ర ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. కాసేపటికి భద్రని ఇక్కడే ఉండమను అని మహేంద్రకి అనుపమ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |